జీహెచ్‌హెంసీలో టీఆర్‌ఎస్‌ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు?

హైదరాబాద్: జీహెచ్‌హెంసీలో టీఆర్‌ఎస్‌ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు? వారసులే రేసులో ఉంటారా? టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంది? జీహెచ్‌హెంసీ మేయర్ పీఠంపై ఈసారి మహిళే కూర్చోబోతున్నారు. జనరల్ కేటగిరీ కింద మహిళకు కేటాయించడంతో టీఆర్ఎస్ నుంచి ఎవరు మేయర్ అభ్యర్థిగా ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ అవుతోంది.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది.. భారీ సంఖ్యలో సీట్లు ఇచ్చింది. ఈసారి కూడా అదే రేంజ్‌లో మహిళలకు స్థానాలు దక్కుతాయనే చర్చ జరుగుతోంది. 2016లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. 44 స్థానాల్లో ఎంఐఎం సత్తా చాటింది.

బీజేపీ 4, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తంగా 76 మంది మహిళలు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. ఇందులో 50కిపైగా టీఆర్ఎస్‌కు చెందిన మహిళా కార్పొరేటర్లు ఉన్నారు.

గత ఎన్నికల్లో గెలిచినవారికి మంత్రులు, నేతలతో పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవు. అయితే ఈసారి హైదరాబాద్‌కు చెందిన మంత్రులు, పెద్ద నేతల కుటుంబసభ్యుల నుంచే మేయర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

For more information saikumarmediatech